1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు విడుదల | CISF Constable Fire Notification 2024 | Freejobsintelugu

Fireman Jobs Notification 2024:

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1130 కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయ్యి 18-23 సంవత్సరాల వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే apply చేసుకోవాలి. దేశంలోని 36 రాష్ట్రాలవారీగా పోస్టులను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా పోస్టులు ఉన్నాయి. OMR/కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు AP, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాలవారు Apply చేసుకోవచ్చు.

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ కి సంబందించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి.

Join Our Telegram Group

ఫైర్ మ్యాన్ జాబ్స్ ముఖ్యమైన తేదీలు:

CISF ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు సంబందించిన ఈ నోటిఫికేషన్ కి అర్హులైన అభ్యర్థులు 31st ఆగష్టు నుండి 30th సెప్టెంబర్ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోచ్చు. అప్లికేషన్స్ పెట్టుకున్నవారు అప్లికేషన్స్ లో ఏమైనా తప్పులు చేసినట్లయితే వారి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి సంబందించి 10th అక్టోబర్ నుండి 12th అక్టోబర్ వరకు సమయం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులలో UR, OBC, EWS అభ్యర్థులు ₹100/- ఫీజు కట్టాలి. ఇతర SC, ST మరియు Ex-serviceman అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్: No Exam

ఎంత వయస్సు ఉండాలి:

అప్లై చేసుకునే అభ్యర్థులు 18-23 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. 30th సెప్టెంబర్ నాటికీ వారికి ఈ వయస్సు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 1.10.2001 నుండి 30.9.2006 మధ్య పుట్టినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 1031 ఉద్యోగాలు

ఫైర్ మ్యాన్ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది:

CISF ఫైర్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ముందుగా Physical Efficiency Test, Physical Standard test, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. Physical Efficiency Test
  2. Physical Standard Test
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  4. రాత పరీక్ష
  5. మెడికల్ టెస్ట్

Physical Efficiency Test :

అభ్యర్థులు 24 నిముషాల్లో 5KM రన్నింగ్ ఈవెంట్ ని పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత

Physical Standard Test:

అభ్యర్థుల హైట్ : 170cm, Chest : 80-85cm ఉండాలి.

రాత పరీక్ష విధానం:

రాత పరీక్షలో జనరల్ ఇంటలిజెన్స్ & రీసనింగ్, అప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు లెవెల్-3 కింద ₹35,000/- జీతం ఇస్తారు. అలాగే ఇతర అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చెయ్యాలి:

ఈ క్రింద ఇచ్చిన Official వెబ్సైటు, నోటిఫికేషన్ pdf లింక్స్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Notification PDF

Apply Online

మరిన్ని విద్యా ఉద్యోగాల సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజూ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!